గన్నవరం: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆయన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం మోహన్ యాదవ్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ప్రముఖుల సందడి
దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక, గాయని సునీత హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చారు. విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.


