లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వానపల్లి త్రిమూర్తులును రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన నీలం ప్రవీణ్‌కుమార్‌ను రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (వరల్డ్ స్టాండర్డ్స్ డే)ను నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆవరణలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్‌లో సభ జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ కార్యాలయం డైరెక్టర్ ప్రేమ్ సజని పట్నాల మాట్లాడుతూ ఏటా ప్రత్యేకమైన థీమ్‌తో ఈ ప్రపంచ స్టాండర్ట్స్ డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎఫర్డ్‌బుల్ అండ్ క్లీన్ ఎనర్జీ–షేర్‌డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(తిరుపతి) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విఘ్నేష్, ఆదిత్య బిర్లా గ్రూప్ అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శివరాజ్ వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాచీన ఆలయాల నమూనాలను అతిథులు సందర్శించారు.


