వినాయకుడికి బంగారు దంతం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

వినాయకుడికి బంగారు దంతం సమర్పణ

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

సంగమేశ్వరం(నాగాయలంక): మండలంలోని సంగమేశ్వరంలో కొలువైన శ్రీగంగాపార్వతీ సమేత సంగమేశ్వరస్వామి దేవస్థానంలో వినాయకస్వామికి భక్తులు గురువారం రూ.1,10,976 విలువైన బంగారు, రూ.5వేలు విలువైన వెండి దంతం సమర్పించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సమీప గ్రామం భావదేవరపల్లికి చెందిన భోగాది కరుణాకర్‌ ఈ ఆభరణాలను దేవదాయశాఖ గుమాస్తా మాజేటి వెంకట నాంచారయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ జరిపి స్వామివారి శేషవస్త్రంతో దాతను ఆలయం తరఫున సన్మానించారు. దాత తండ్రి వెంకటరాయుడు, సోదరి జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement