ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, కమిషనర్ చంద్రమోహన్, చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి
శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన హోం మంత్రి అనితను ఆలయ అధికారులు సాదరంగా స్వాగ తం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.


