ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవదాయ ధర్మదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొండ దిగువన మోడల్‌ ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు అమ్మవారి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఈవో వీకే శీనా నాయక్‌ ఉన్నారు.

రాజమహేంద్రవరం: 70వ ఎస్‌జీఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ – 2026 బాలికల విభాగంలో విజేతగా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. బాలుర విభాగంలో విశాఖపట్నం విజయకేతనం ఎగురవేసింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో కృష్ణా జిల్లా జట్టు మూడో స్థానంలో నిలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement