దుర్గమ్మకు వెండి పాదుకలు, పళ్లేల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు వెండి పాదుకలు, పళ్లేల సమర్పణ

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

దుర్గమ్మకు వెండి పాదుకలు, పళ్లేల సమర్పణ కేశఖండన శాల వెలవెల సమాజ హితమే లక్ష్యం కావాలి బీచ్‌ ఫుట్‌బాల్‌ విజేతగా ఎన్టీఆర్‌ జిల్లా

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన పి.శేషగిరిరావు కుటుంబం వెండి వస్తువులను కానుకగా సమర్పించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణను కలిసి రెండు కిలోల వెండితో తయారు చేయించిన రెండు పళ్లేలు, రెండు పాదుకలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్‌, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పాల్గొన్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మ వారి పాదాలు సమీపంలో ఏర్పాటు చేసిన కేశఖండన శాల సోమ వారం ఖాళీగా దర్శనమిచ్చింది. రెండో రోజైనప్పటికీ కేశఖండన శాల కౌంటర్లు ఖాళీగా, భక్తులు లేక వెలవెలబోతూ కనిపించాయి. తల నీలాల టికెట్‌కు రూ.40 వసూలు చేస్తుండటంపై భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సమాజ హితమే లక్ష్యంగా విద్యార్థులు అడుగులు వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కాలేజీ ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యా ర్థుల రెండో గ్రాడ్యుయేషన్‌ వేడుకలు కళాశాల ఆవరణలో సోమవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్‌ఐటీ ఢిల్లీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఓ.చంద్రశేఖర్‌ మాట్లా డుతూ.. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు చలవాది మల్లికార్జునరావు, చిట్టా అమర్‌సుధీర్‌, కోశాధికారి కాజా రాఘవయ్య, ఉపాధ్యక్షుడు పొట్టి సురేంద్రకుమార్‌, సహాయ కార్యదర్శి గ్రంధి పవన్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శరవణకుమార్‌ ఆయా విభాగాధిపతులు పాల్గొన్నారు.

చీరాల రూరల్‌: బీచ్‌ ఫుట్‌బాల్‌ విజేతగా ఎన్టీఆర్‌ జిల్లా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్‌లో మూడు రోజులుగా ఏపీ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ బీచ్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఆదివారం రాత్రి ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 17 జిల్లాల క్రీడా జట్లు పాల్గొన్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థి జట్లను మట్టికరిపించిన విశాఖపట్టణం–ఎన్టీఆర్‌ జిల్లాల జట్లు ఫైనల్‌కు చేరాయి. ఫైనల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు విజేత నువ్వానేనా అన్నట్లుగా చిరుతపులుల్లా పోరాడాయి. చివరకు ఎన్టీఆర్‌ జిల్లాజట్లు 1–0 గోల్స్‌ తేడాతో వైజాగ్‌ జట్టును ఓడించి విజేతగా నిలిచి మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నూతలపాటి దేవదాసు, విజయ్‌ కుమార్‌, బాలశౌరి, బాలాజీ, దీవెనయ్య, అగస్టీన్‌, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement