విజయవాడ మేయర్‌ పీఠం జనరల్‌కే! | - | Sakshi
Sakshi News home page

విజయవాడ మేయర్‌ పీఠం జనరల్‌కే!

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

విజయవాడ మేయర్‌ పీఠం జనరల్‌కే! ● విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 86 డివిజన్లకు గాను ఎస్టీ మహిళ ఒకటి, ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ మహిళ ఐదు, ఎస్సీ జనరల్‌ ఐదు, బీసీ జనరల్‌ 16, బీసీ మహిళ 15, జనరల్‌ మహిళ 22, జనరల్‌ స్థానాలు 21గా ప్రకటించారు. మేయర్‌ స్థానాన్ని విజయవాడ జనరల్‌కు కేటాయించారు. ● మచిలీపట్నంలో 60 డివిజన్లకు గాను ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ మూడు, ఎస్సీ మహిళ రెండు, బీసీ జనరల్‌ 12, బీసీ మహిళ 12, జనరల్‌ మహిళ 16, జనరల్‌ 14 సీట్లుగా ప్రకటించారు. మేయర్‌ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. ● పెడన మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వగా 28 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ ఒకటి, ఎస్సీ మహిళ ఒకటి, బీసీ జనరల్‌ ఆరు, బీసీ మహిళ ఐదు, జనరల్‌ మహిళ ఎనిమిది, జనరల్‌ ఆరు వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. ● ఉయ్యూరు చైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, 32 వార్డు స్థానాల్లో ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ మూడు, ఎస్సీ మహిళ మూడు, బీసీ జనరల్‌ ఐదు, బీసీ మహిళ నాలుగు, జనరల్‌ మహిళ తొమ్మిది, ఏడు వార్డులు జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. ● నందిగామ మునిసిపల్‌ చైర్మన్‌ పదవిని జనరల్‌గా ప్రకటించగా, ఉన్న 32 వార్డుల్లో ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్టీ మహిళ ఒకటి, ఎస్సీ జనరల్‌ మూడు, ఎస్సీ మహిళ మూడు, బీసీ జనరల్‌ నాలుగు, బీసీ మహిళ నాలుగు, జనరల్‌ మహిళ ఎనిమిది, జనరల్‌ ఎనిమిది వార్డులుగా రిజర్వయ్యాయి. ● జగ్గయ్యపేట మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కాగా, 36 స్థానాల్లో ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్టీ మహిళ ఒకటి, ఎస్సీ జనరల్‌ మూడు, ఎస్సీ మహిళ రెండు, బీసీ జనరల్‌ ఆరు, బీసీ మహిళ ఐదు, జనరల్‌ మహిళ పది, జనరల్‌ ఎనిమిది వార్డులు రిజర్వు అయ్యాయి. ● తిరువూరు మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. 28 వార్డులకు సంబంధించి ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ మూడు, ఎస్సీ మహిళ మూడు, బీసీ జనరల్‌ నాలుగు, బీసీ మహిళ మూడు, జనరల్‌ మహిళ ఎనిమిది, మరో ఆరు వార్డులకు జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. ● కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు కేటాయించారు. 40 వార్డులకు సంబంధించి ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్టీ మహిళ ఒకటి, ఎస్సీ జనరల్‌ నాలుగు, ఎస్సీ మహిళ మూడు, బీసీ జనరల్‌ ఆరు, బీసీ మహిళ ఐదు, జనరల్‌ మహిళ పదకొండు, జనరల్‌ తొమ్మిది వార్డులుగా రిజర్వ్‌ అయ్యాయి.

బీసీ జనరల్‌కు మచిలీపట్నం కార్పొరేషన్‌ మేయర్‌ రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం మునిసిపల్‌ రిజర్వేషన్లు కూడా ఖరారు నేడు డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించింది. మచిలీపట్నం మేయర్‌ సీటు బీసీ జనరల్‌కు ఖరారైంది. ఇక మునిసిపాలిటీల చైర్మన్ల సీట్లకు సంబంధించి నందిగామ జనరల్‌, పెడన, జగ్గయ్యపేట జనరల్‌ మహిళ, కొండపల్లి ఎస్‌సీ మహిళ, ఉయ్యూరు ఎస్సీ జనరల్‌, తిరువూరు, తాడిగడప బీసీ జనరల్‌ కాగా గుడివాడ బీసీ మహిళకు కేటాయించింది. తాడిగడప, గుడివాడ మునిసిపాలిటీల వార్డు రిజర్వేషన్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement