హనుమాన్‌జంక్షన్‌రూరల్: స్థానిక ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం అన్నప్రసాద ట్రస్ట్‌కు దాతలు రూ.లక్ష విరాళాన్ని అందించారు. గుడివాడకు చెందిన వీరమాచినేని సీత రామదాసు, లక్ష్మీరాజ్యం దంపతులు, కుమారుడు నరేష్‌బాబు అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావులకు అందించారు. అనంతరం ఆలయంలో అభయాంజనేయ స్వామికి దాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దాతలకు ఆశీర్వచనం అందించి, స్వామి వారి శేషవస్త్రాలను అందించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు దాతలను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.


