ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న రాష్ట్ర సమాఖ్య రూపొందించిన మెమొరాండంను రాష్ట్రంలోని అన్ని మండలాల అధ్యక్షులు ఆయా మండల కార్యాలయాల్లో అధికారులకు అందజేయాలని, 15న జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని సూచించారు. డీలర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల, జిల్లా కమిటీలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చి ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఫార్మాస్యూటికల్స్ వ్యాపారిని మోసగించి రూ.66 లక్షలకు టోపీ పెట్టిన వ్యక్తిపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం సుఫలా బిల్డింగ్ రోడ్‌లో నివసించే దేవరశెట్టి వెంకట నరేష్ గత 30 ఏళ్లుగా వన్‌టౌన్ చల్లంరాజు వీధిలో చంద్ర ఫార్మాస్యూటికల్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. హోల్‌సేల్‌గా మందులు విక్రయిస్తున్న ఆయనకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వాసవి ఫార్మా కాంప్లెక్స్‌లో రెండు షాపులు ఉన్నాయి. ఈ క్రమంలో కర్లపూడి నరేష్ అనే వ్యక్తి 2010 నుంచి హనుమాన్ డ్రగ్స్ పేరుతో ఫిర్యాదుదారు నరే ష్‌తో మెడికల్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిసారి బిల్ టు బిల్ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు. అయితే తనకు గవర్న్‌మెంట్ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి 2022–23 మధ్య కాలంలో రూ.66 లక్షల విలువైన మెడిసిన్ తీసుకుని డబ్బు ఇవ్వలేదు. అప్పటి నుంచి డబ్బులు గురించి అడిగితే రేపు ఇస్తా..ఎల్లుండి ఇస్తా అంటూ చెప్పేవాడు. ఈ ఏడాది జూన్ నెలలో గొల్లపూడిలో కనిపించినప్పుడు అడిగితే చంపేస్తానని కర్లపూడి నరేష్ బెదిరించినటు దేవరశెట్టి వెంకట నరేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన
ఇబ్రహీంపట్నం: రోడ్డు పక్కన మాట్లాడుతున్న యువకులపైకి జీపు దూసుకెళ్లిన ఘటన మండలంలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో కేతనకొండ గ్రామానికి చెందిన సాలవ వెంకటేష్(30) మృతి చెందాడు. సేకరించిన సమాచారం మేరకు సాలవ వెంకటేష్ తన స్నేహితుడిని కలిసేందుకు కిలేశపురం గ్రామం వచ్చాడు. హైవేకు 30 మీటర్ల దూరంలో బైక్ పక్కన పెట్టి మాట్లాడుతుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన జీపు వెంకటేష్‌ను ఢీకొట్టింది. హుటాహుటినా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. నిత్యం రద్దీగా ఉండే సెంటర్‌లో సెలవు రోజు కావడంతో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య, 8 నెలల బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా జీపు నడిపి యువకుడి ప్రాణాలు బలిగొన్న వారిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ పరిణామాలతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


