వైఎస్సార్‌ సీపీలో టీడీపీ నాయకుల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో టీడీపీ నాయకుల చేరిక

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

వైఎస్సార్‌ సీపీలో టీడీపీ నాయకుల చేరిక

చల్లపల్లి: మండల పరిధిలోని నడకుదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు సమక్షంలో ఆదివారం రాత్రి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈసందర్బంగా తొలుత ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. రాముడుపాలెం, నాదెళ్లవారిపాలెం, పాతనడకుదుర గ్రామాల నుంచి ప్రజలు ర్యాలీగా నడకుదురు ప్రధాన సెంటర్‌కు తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారుల వెంట పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానుల కేరింతల మధ్య నడకుదురు సెంటర్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సింహాద్రి రమేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. నాడు జగన్‌మోహనరెడ్డి పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం, అభివృద్ధికోసం పనిచేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఆర్థిక సంపన్నులకు మాత్రమే లబ్ధి చేకూర్చేందుకు పని చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఏదో చేస్తాడని చంద్రబాబుకు ఓటేసిన ప్రజలు మోసపోయామని గ్రహించి తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బలపరిచేందుకు సిద్ధమయ్యారన్నారు. మరలా వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నడకుదురు మాజీ సర్పంచ్‌ గొరిపర్తి సురేష్‌బాబు, కృష్ణాజిల్లా బూత్‌ కమిటీ విభాగం అధ్యక్షుడు మద్ది వెంకటనారాయణ(చిన్న), జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి బండ్రెడ్డి తేజ, మండల యూత్‌ అధ్యక్షుడు వెనిగళ్ల తారకజగదీష్‌, మహిళా కన్వీనర్‌ బొందలపాటి లక్ష్మి నాయకులు బొంతు నాని, బుస్సా కమలాకరరావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

30 కుటుంబాలు చేరిక..

టీడీపీకి చెందిన 30 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. నడకుదురు గ్రామ కన్వీనర్‌ నలిగిలి విజయరాజు, మాతంగి ఆదిశేషుల ఆధ్వర్యంలో మాతంగి శ్రీనివాసరావు, నలిగిలి రామకృష్ణ, బలుసుపల్లి శ్రీనివాసరావు, కొలుసు నాగరాజు, పెద్దిబోయిన ఏడుకొండలు, కనుమూరి గోవిందరావులతోపాటు మరో 25 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. సింహాద్రి రమేష్‌బాబు వారికి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement