విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు చౌటుప్పల్‌ : ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్‌బస్సు ఒక్కసారిగా రోడ్డు కిందికి దూసుకెళ్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు అడ్డుగా ఉండటంతో బోల్తా పడకుండా ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామపంచాయితీ మదిర బొర్రోళ్లగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఇంటర్‌సిటీ ట్రావెల్‌ బస్సు రోజు మాదిరిగా శనివారం అర్ధరాత్రి సైతం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ నుంచి ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరింది. సూర్యాపేట జిల్లా కేటీఅన్నారం గ్రామానికి చెందిన నిమ్మల యాదగిరి బస్సు నడుపుతున్నాడు. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుకు ఎడమవైపునకు దూసుకెళ్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు బస్సును ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. దీంతో బస్సు బోల్తా పడకుండా ఆగింది. ప్రయాణికులు వాహనంలో నుంచి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్‌ మద్యం మత్తు, నిద్ర ప్రధాన కారణంగా పలువురు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

దాములూరు(ఇబ్రహీంపట్నం): విద్యుతాఘాతంతో ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కార్మికుడు మృతి చెందిన ఘటన మండలం పరిధిలోని దాములూరులో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది కార్మికులు దాములూరులో నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు పనుల కోసం ఓ కాంట్రాక్టర్‌ తీసుకొచ్చారు. ఈ క్రమంలో విద్యుత్‌ లైన్‌మన్‌ విద్యుత్‌ తీగల పనులు చేయిస్తుండగా డుంబి సింకు (33) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో నిమ్రా వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్‌ లైన్‌మన్‌ నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మరణించాడని తోటి కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు డిమాండ్‌ చేశారు. గ్రామం వెలుపల ఉన్న విద్యుత్‌ లైన్‌లు ఒకదానికి ఒకటి కలుసుకోవడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement