హోల్డింగ్‌ పాయింట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

హోల్డింగ్‌ పాయింట్ల పరిశీలన

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా హోల్డింగ్‌ పాయింట్లలో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని దుర్గగుడి ఈవో శీనా నాయక్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఈవో శీనానాయక్‌, ఇంజినీరింగ్‌ అధికారులు ఆదివారం పరిశీలించారు. తొలుత సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేస్తున్న కేశఖండనశాల, భక్తులు వేచి ఉండే హోల్డింగ్‌ పాయింట్లను పరిశీలించారు. ఈ ఏడాది నాలుగు హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసరమయితే అదనంగా మరో పాయింట్‌ను ఏర్పాటు చేసేలా ఆలయ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనంతరం కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద జరుగుతున్న క్యూలైన్‌ పనులను పరిశీలించారు. ఈవో వెంట ఈఈ ఎల్‌.రమాదేవి, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు రవీంద్ర, మస్తాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement