కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలం పరిధిలోని కిలేశపురం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. సెక్టార్ ఎస్‌ఐ బోనగిరి రాజు తెలిపిన వివరాల మేరకు నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మండ్రు కృష్ణంరాజు(37) వ్యక్తిగత పనులపై తన బైక్‌పై విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కిలేశపురం వద్దకు చేరుకునే సమయానికి వెనుక నుంచి దూసుకు వచ్చి న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో రోడ్డుపై పడిన కృష్ణరాజు మీదుగా లారీ దూసుకెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయి ప్రాణాలు విడిచా డు. సంఘటన జరిగిన అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి లారీని వెంబడిస్తూనే ఎస్‌ఐ రాజుకు ఫోన్ ద్వారా సమాచా రం అందించాడు. హుటాహుటినా పోలీస్ వాహనంలో వెళ్లిన ఎస్‌ఐ దొనబండ క్వారీల రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


