అన్నప్రసాదానికి పలువురి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అన్నప్రసాదానికి పలువురి విరాళాలు

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

అన్నప్రసాదానికి పలువురి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ ఎస్‌బీఐ కాలనీకి చెందిన బొప్పన దుర్గా వెంకట్‌రామ్‌ కుటుంబం రూ.1,00,005, ప్రజాశక్తినగర్‌కు చెందిన దావూలూరి ప్రభాకరావు కుటుంబం రూ.1,00,005, మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టి.తారక రామారావు కుటుంబం రూ. 1.16 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement