సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

సుబ్బారాయుడి ఆదాయం రూ.8.28 లక్షలు బాల్య వివాహాల నిర్మూలన పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు ఏలూరు కాలువలో దూకిన యువకుడు తుళ్లూరు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ప్రమాదం ● లారీ కింద పడి వ్యక్తి మృతి, భార్యకు తప్పిన ప్రమాదం ● ఘటనతో లారీలకు అడ్డుపెట్టి నిలిపివేసిన స్థానికులు, నిలిచిన ట్రాఫిక్‌

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8,28,687లు ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా టికెట్ల ద్వారా రూ.7,16,051లు, డొనేషన్లు రూ.1,12,636 మొత్తం రూ.8,28,687 ఆదాయం సమకూరిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): బాల్య వివాహాల నిర్మూలనపై భారతదేశం నుంచి వినిపించిన గళం నేడు ప్రపంచ స్థాయి సంకల్పంగా మారిందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి.కీర్తి అన్నారు. దేశంలోని జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌ సంస్థ చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించి, నవంబర్‌ 27న బాల్య వివాహాల నిర్మూలన దినంగా ప్రకటించడం గొప్ప విషయమని ఆమె పేర్కొనారు. మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ భాగస్వాములతో కలిసి ‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ (బాల్య వివాహ రహిత భారత్‌) ప్రచారాన్ని 2024 సెప్టెంబర్‌లో ప్రారంభించామన్నారు. జిల్లాల్లోని ఏదో ఒక గ్రామంలో కనీసం ఒక్క బిడ్డ అయినా బాల్య వివాహం ముప్పులో ఉన్నంత కాలం, మా పోరాటం అసంపూర్ణంగానే ఉంటుందని చెప్పారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేమని ఆమె పేర్కొన్నారు. అందుకే పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఏపీ కో ఆర్డినేటర్‌ బి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): ఏలూరు కాలువలో దూకి యువకుడు గల్లంతైన ఘటనపై ఆదివారం ఎస్‌ఎన్‌పురం పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. కాజా గౌరీ శంకర్‌(26) కేదారేశ్వరపేట పండ్లమార్కెట్‌లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని అక్క రౌతు లక్ష్మి కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి ఇంటో డబ్బులు ఇవ్వకపోవడంతో అక్క నిలదీసింది. డబ్బులు తీసుకొస్తానని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గౌరీశంకర్‌ అక్క అతను పనిచేసే మేస్త్రికి ఫోన్‌ చేయగా ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం తమ్ముడికి రౌతు లక్ష్మి ఫోన్‌ చేయగా సాయంత్రం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గౌరీ శంకర్‌ మీసాల రాజారావు వంతెనపై నుంచి ఏలూరు కాలువలో దూకినట్లు తెలిసిన వారు ఫోన్‌ చేసి తెలపగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని ఎస్‌ఎన్‌పురం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి గౌరీశంకర్‌ కోసం గాలింపు చేపట్టారు.

తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్‌, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement