అన్నదానానికి పలువురి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి పలువురి విరాళాలు

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ ఎనికేపాడు కేవీఆర్‌ కాల నీకి చెందిన పి.రవిశంకర్‌ దంపతులు అమ్మవారిని దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన చుండూరి శ్రీనివాసరావు దంపతులు అన్నదా నానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీ ర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ ఎన్‌.రమేష్‌బాబు, ఆలయ అధికారి శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

యువకుడు ఆత్మహత్య

గన్నవరం: కుటుంబ సభ్యులు మందలించా రని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముస్తాబాదలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముస్తాబాదకు చెందిన నర్రా నాగసాయిరామ్‌(30) గ్రామంలో షామియానా దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య ప్రసవం నిమిత్తం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను రోజు మద్యం తాగుతున్నాడు. నాగసాయిరామ్‌ను తండ్రి, సోదరుడు గట్టిగా మందలించారు. మనస్తాపా నికి గురైన నాగసాయిరామ్‌ ఉదయం 11 గంట లకు ఇంటిలో ఎవరు లేని సమయంలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement