అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఉచిత ఆరోగ్య బీమా

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంధ క్రికెటర్లకు తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య పాలసీని కల్పిస్తున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు కేశి నేని శివనాథ్‌ తెలిపారు. నగరంలోని ఏసీఏ కార్యాలయంలో అంధ క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్‌ మాట్లాడుతూ.. ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పు ఆరోగ్య బీమా కవరేజ్‌ కలిగిన పాలసీలను అందజేశామన్నారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగ క్రికెట్‌ అభివృద్థికి ఏసీఏ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. భారత అంధుల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇ.అజయ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఆరోగ్య పాలసీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత అంధుల క్రికెట్‌ జట్టు ప్రస్తుత కెప్టెన్‌ దుర్గారావు, క్రీడాకారులు వెంకటేష్‌, రవి, దున్నా వెంకటేశ్వరరావు, కుమారి సత్యవతి పాలసీ పత్రాలను అందుకున్నారు. డెఫ్‌ క్రికె టర్‌ యశ్వంత్‌ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్‌ అండ్‌ డంబ్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన కుమారి జోష్నారెడ్డిని సత్కరించారు. భారత అండర్‌–19 మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికై న కాట్రగడ్డ దీక్షను శివనాథ్‌ అభినందించారు. అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్‌రట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు, డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement