మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాధిపతి డాక్టర్ కె.ఆర్.జి.శేషు కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శనివారం అవార్డు అందుకున్నారు. శేషుకుమార్‌కు శాలువా, జ్ఞాపిక, సర్టిఫికెట్, మెడల్‌తోపాటు, రూ.20 వేల నగదు పారితోషకం అందజేశారు. ఈ సందర్భంగా శేషుకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందు కోవడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, అధ్యాపక సిబ్బంది, పలువురు విద్యార్థులు శేషుకుమార్, మరో అవార్డు గ్రహీత ముప్పా పద్మనాభంను అభినందించారు.


