న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మి
చిలకలపూడి(మచిలీపట్నం): జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి అన్నారు. జీవిత బీమా సంస్థ డివిజన్ కార్యాలయంలో మంగళవారం సంస్థ 70వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేద వారికి, ప్రజలకు ఉచిత న్యాయసేవా కార్యక్రమాలను అందిస్తోందన్నారు.
ఎల్‌ఐసీ కార్పొరేట్ పథకం ప్రారంభం..
ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ నున్న నాగేశ్వరరావు ఎల్‌ఐసీ కార్పొరేట్ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాలసీల అంశంలో 65.16 శాతం, ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం మార్కెట్ వాటాను కై వసం చేసుకుని జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో లీడర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. వారోత్సవాల సందర్భంగా 7వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎల్‌ఐసీ డివిజనల్ అధికారి మహమ్మద్‌ఖాజా, ఎంఎస్ సుబ్రహ్మణ్యం, కేడీవీఎస్ కృష్ణ, సీహెచ్ వెంకటరమణ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.


