మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

గన్నవరం: స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్‌షాపు వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై కొంత మంది యువకులు దాడిచేసి కొట్టిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక కోనాయి చెరువు సమీపంలోని వైన్‌షాపు రాత్రి 10గంటలకు మూసివేసిన తర్వాత జానీ అనే వ్యక్తితో అధిక ధరలకు దొడ్డిదారిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసరపల్లి శివారు వీఎన్‌ పురం కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సతీష్‌కుమార్‌ మద్యం కోసం అర్ధరాత్రి 12 గంటలకు వైన్‌షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు చేసి గేటు వద్దకు వచ్చిన అతనిపై బైక్‌పై వచ్చిన కొంత మంది యువకులు ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి పరారయ్యారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వేరే వ్యక్తి అనుకొని..

అయితే ఈ ఘటనకు ముందు వైన్‌షాపు వద్ద కొంత మంది యువకుల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సదరు యువకులు పొరబడి గొడవ పడ్డ వ్యక్తి అనుకుని డ్రైవర్‌పై అకారణంగా దాడిచేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వైన్‌షాపు వద్ద గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికి ఎకై ్సజ్‌, పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు కారణంగా వైన్‌షాపు ఉన్న వీఎన్‌. పురం రోడ్డులో ప్రయాణించలంటేనే మహిళలు, ఆడపిల్లలు భయపడే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement