రామ్‌జీ పథకం పనుల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రామ్‌జీ పథకం పనుల్లో నాణ్యత పాటించాలి

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

జయంతిపురం(జగ్గయ్యపేట): ఎన్టీఆర్‌ జిల్లాలో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. పథకం ద్వారా చేపడుతున్న పనులు రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చటంతో పాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యాన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని అర్హులైన రైతులు ఆ పంటల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ శిరీష, డ్వామా ఏపీవో రామ కృష్ణ, డీఎల్‌డీవో లక్ష్మీకుమారి, ఎంపీడీవో అరుణ కుమారి, ఆర్‌ఐ ఆనందబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఏపీఐఐసీ భూములను కలెక్టర్‌ పరిశీలించారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement