లబ్బీపేట(విజయవాడతూర్పు): బాధితులకు తక్షణ న్యాయం, సహాయం అందించే అధికారం, ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుత అవకాశం ఒక్క పోలీస్ శాఖలోనే లభిస్తుందని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తూ సోమవారం ఉద్యోగ విరమణ పొందిన 13 మంది అధికారులు, సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శాలువాలు కప్పి సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో సీఏఓ ఐవీఆర్ నాగవర్ధన్, ఎస్‌ఐలు జె.జ్ఞానదేవ్, ఎస్.సాయిబాబా, పీఎస్‌ఎస్ రెడ్డి, ఎం.శ్రీనివాసప్రసాద్, ఎం.శ్రీధర్, రిజర్వ్ ఏఎస్‌ఐ జీఎస్‌ఎన్‌మూర్తి, బి.ప్రసాద్, సీహెచ్ శివాజీ, హెడ్ కానిస్టేబుల్ బీఎన్‌వీకేడీ ప్రసాద్, ఎస్.పాండురంగయ్య, హోంగార్డులు కె.లక్ష్మీనారాయణ, పి.రమణ ఉన్నారు. వారి సత్కార కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రేమ్‌కుమార్, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, సుధాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు.


