పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 98 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 98 ఫిర్యాదులు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 98 ఫిర్యాదులు ముగిసిన సంస్కృత సప్తాహ మహోత్సవాలు ‘ముకుంద జ్యూవెలరీ’ ఔట్‌లెట్‌ ప్రారంభం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 98 ఫిర్యాదులు అందాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్‌ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందకున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి తగాదాలపై 41, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 22, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 4, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 17 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు, పలువురుసిబ్బంది పాల్గొన్నారు.

నిమ్మకూరు(పామర్రు): తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్‌ ఆర్డీ విల్సన్‌ శరత్‌ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు తెలుగు సంస్కృతి అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఏపీలో జరిగాయి. దీనిలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌ఎస్‌ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర జరిగింది. టీటీడీ కమ్యూనిటీ హాల్‌ విద్యార్థులు సంస్కృత భాష గొప్పదనాన్ని వివరించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఏపీఆర్‌జెసీ కళాశాల ప్రధానాచార్యులు సాంబశివరావు, ఏపీ గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు మండలి బ్రహ్మణేశ్వరమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్‌ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్‌మార్క్‌ గోల్డ్‌ జ్యువెల్లరీ, స్టోన్స్‌ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్‌ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్‌ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్‌తోపాటు క్యారెట్‌కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ సేల్‌ను నగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement