పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలి

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పీఆర్సీ కమిషనర్‌ను నియమించేలోపు ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏపీజేఏసీ, అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా యూనిట్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఉద్యోగుల సమస్యలతో కూడిన నోటీసు/వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మొత్తం 29 డిమాండ్లతో కూడిన నోటీసు అందజేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15 నుంచి వర్క్‌ టు రూల్‌ పాటిస్తామని, మంగళవారం నల్లబ్యాడ్జ్‌లు ధరించడం, 3, 5వ తేదీలు భోజన విరామ సమయం లో ప్రదర్శనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్‌ వైఎస్‌ రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు పి.లక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్‌. శ్రీనివాసరావు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అధ్యక్షులు సంపత్‌, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement