గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి స్టేట్‌లెవల్ చాంపియన్‌షిప్‌లో జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, కోచ్‌లు భాస్కర్ (బ్యాడ్మింటన్), నవీన్ కుమార్ (ఆర్చరీ), స్వామి (వెయిట్ లిఫ్టింగ్), ఇషాక్, చిరంజీవి (బాక్సింగ్), సంతోష్ (బాస్కెట్‌బాల్), ఆంజనేయులు, శిరీష (యోగా), క్రీడాకారులు పాల్గొన్నారు.


