లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం విధుల బహిష్కరించి 15 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగులకు ఉపయోగపడేలా బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 50 మంది జూడాలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్టైపెండ్ రివిజన్ ఇంప్లిమెంట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తొలుత నిరసన శిబిరంలోనే రక్తదానం చేయాలని భావించినా, అనంతరం బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. జూడాలు విధుల బహిష్కరణతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు
Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.91 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు సోమ వారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకు రూ.3,91,17,684 నగదు, 306 గ్రాముల బంగారం, 4.170 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. యూఎస్‌ఏ డాలర్లు 663, మలేషియా రింగిట్లు 107, యూఏఈ దిర్హమ్స్ 840, యూరప్ యూరోలు 85, ఇంగ్లాండ్ పౌండ్లు 90, ఓమన్ బైసాలు 4,100, సౌత్ ఆఫికా రౌండ్స్ 200తో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు వివరించారు. కానుకల లెక్కింపును ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, డీఈఓ కిషోర్‌కుమార్, ఏసీ రంగారావు పర్యవేక్షించారు.
రక్తదానం చేసిన జూడాలు
Advertisement


