ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ప్రణా

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి మాచవరంలో మరో వ్యక్తి..

స్థాయీ సంఘ సమావేశంలో వీఎంసీ మేయర్‌ భాగ్యలక్ష్మి

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వీఎంసీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఆమె స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశపు అజెండాలో మొత్తం 32 అంశాలు ప్రతిపాదనకు రాగా వాటిలో 23 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఒక అంశాన్ని వాయిదా వేయగా, నాలుగు అంశాలు ర్యాటీఫై చేస్తూ తీర్మానించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా మరో అంశాన్ని ధ్రువీకరించారు.

ప్రధానాంశాలివే..

● విజయవాడలోని సర్కిల్‌–2 పరిధిలో ఉన్న లెనిన్‌ సెంటర్‌ వద్ద శిల్కోషోరూం ఎదురుగా వీఎంసీ పార్కింగ్‌ స్థలాన్ని లీజు పొడగింపునకు వచ్చిన ప్రతిపాదనను సభ్యులు తిరస్కరిస్తూ తీర్మానించారు.

● నగరపాలక సంస్థ పరిధిలోని సర్కిల్‌–1లో కబేళాను ఏడాదిపాటు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను వాయిదా వేస్తూ తీర్మానం చేశారు.

● నగరపాలక సంస్థలో హార్టీకల్చర్‌ ఆఫీసర్‌(హెచ్‌వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు రూ. 60వేలు వేతనాన్ని పెంచుతూ వచ్చిన తీర్మానంపై సభ్యులు ఆమోదం తెలిపారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా బురుజుపల్లె తండాకు చెందిన మూడావత్‌ గణేష్‌ నాయక్‌(18) పెనమలూరులోని ప్రైవేటు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గణేష్‌ నాయక్‌ తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌కు రూ. 2.6లక్షలు, ద్వితీయ సంవత్సరానికి రూ. 2.85 లక్షలు చెల్లించి చదివిస్తున్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. ఇదే విషయాన్ని గణేష్‌నాయక్‌ తలిదండ్రులకు ఫోన్‌ చేసి తాను ఎంత కష్టపడి చదివినప్పటికీ మార్కులు రావటం లేదని.. గుర్తుండటం లేదని చెప్పాడు. దీనికి తలిదండ్రులు గుర్తున్నదే రాయి అని ధైర్యం చెప్పారు.

అంతర్మథనంతో అఘాయిత్యం..

అయినప్పటికీ రూ. లక్షలాది రూపాయల వ్యయంతో తనను చదివిస్తున్నారని.. తాను ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నానని మథన పడుతున్నాడు. మంగళవారం నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి స్టడీ అవర్‌ నుంచి బయటకు వచ్చిన గణేష్‌ నాయక్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. 7వ నంబర్‌ ప్లాట్‌ఫాంలో ఆదివారం రాత్రి రైలు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు.

తల్లిదండ్రుల అనుమానం..

గణేష్‌నాయక్‌ తల్లిదండ్రులు ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఏదో గొడవ కారణంగానే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించి, న్యాయం చేయాలని కోరుతున్నారు.

గుణదల(విజయవాడ తూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన గడ్డం సుమంత్‌(28) గత కొంత కాలంగా మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వీట్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం పరిచయమైన రామలక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తూ.. ఇద్దరూ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య వ్యక్తి గత విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచీ ఇంట్లోనే ఉన్న సుమంత్‌ ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటికి అక్కడకు వచ్చిన రామలక్ష్మి అతనిని చూసి కంగారు పడి కేకలు వేసింది. అంతలో అక్కడకు చేరుకున్న స్థానికులు మృతుడిని కిందకి దించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి 1
1/2

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి 2
2/2

ప్రణాళికబద్ధంగా విజయవాడ అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement