ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం | - | Sakshi
Sakshi News home page

ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం

ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం

ఆలయాలతో గ్రామాలకు ఆధ్యాత్మిక బలం

పామర్రు(పమిడిముక్కల): గ్రామ జీవనానికి ఆలయాలు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అన్నారు. పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని (గౌడ రామాలయం) సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రతిష్టా మహోత్సవాల పోస్టర్‌లను, కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని, ఆలయ కార్యకలాపాలకు తన మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ బొర్రా వీర వెంకట రామ్మోహనరావు(చిన్నబాబు) ఆధ్వర్యంలో మొత్తం విరాళాలు రూ.3,61,579ను మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. బొర్రా వీర వెంకట రామ్మోహనరావు రూ.2,25,999, ఈడే వెంకట సత్యనారాయణ రూ.1,00,116, కోకా మాధవరావు రూ.10,116, కాగిత సుబ్బారావు రూ.10,116, ఈడే జంగమయ్య రూ.10,116, పరిమికాయల విజయలక్ష్మి రూ.5,116 స్వామికి విరాళాలుగా అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్‌, వైస్‌ ఎంపీపీ గంజాల సీతారామయ్య, మండల ప్రధాన కార్యదర్శి గరికపూడి బుజ్జి, నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement