
విజయవాడ కోర్టులో ఈ–సేవా కేంద్రాలు ప్రారంభం
విజయవాడలీగల్: విజయవాడ కోర్టులో గురువారం తొలి ఈ–సేవ కేంద్రాన్ని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ ప్రారంభించారు. రెండవ ఈ–సేవ కేంద్రాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి ఎస్.సునీల్, మూడవ ఈ–సేవ కేంద్రాన్ని కమర్షియల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇకనుంచి ఎటువంటి దావాలు కానీ, దావాకి సంబంధించిన దస్తావేజులు కానీ ఫైల్ చేసుకోవటానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. దీని ద్వారా న్యాయవాదులకు కక్షిదారులకు ఖర్చు తక్కువ, పని సులభం అవుతుంది కక్షిదారులకు కావలసిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కేంద్రంలో అడిగి తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవనమ్మ, ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జడ్జి ఎ.అనిత, 13వ అదనపు జిల్లా జడ్జి శేషయ్య, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు, సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి, ఏడో అదనపు జిల్లా జడ్జి అబ్రహం, నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.అంజనీ ఎస్‌ఎస్ రామ ఆదిత్య రిషిక, మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. తిరుమల రావు, ఇతర జడ్జిలు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: మునేరులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రం పెనుగంచిప్రోలులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ఆరేపల్లి మండలం వాకావారిపాలెం గ్రామానికి చెందిన వాకా శ్రీనివాసరావు(58) నాలుగు రోజుల కిత్రం పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం స్థానికులు మునేరులో మృతదేహం ఉందని సమాచారం ఇవ్వటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డుతో వారి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు. ప్రమాదవశాత్తు మునేరులో పడి మరణించి ఉంటాడని అన్నారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

విజయవాడ కోర్టులో ఈ–సేవా కేంద్రాలు ప్రారంభం