పోప్ ఫ్రాన్సిస్‌కు కథోలికుల నివాళి
పటమట(విజయవాడతూర్పు): విశ్వశాంతిదూత, పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ కథోలిక శ్రీసభలో అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని విజయవాడ కేథలిక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సేవలను కొనియాడుతూ శనివారం ఉదయం బెంజిసర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చిలో విజయవాడ కేథలిక్ డయాసిస్ ఆధ్వర్యాన నివాళులర్పిస్తూ, అంతిమ దివ్య పూజాబలి సమర్పణ కార్యక్రమం జరిగింది. తొలుత పవిత్ర పూజాపీఠంపై పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి బిషఫ్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ మెశపాం గాబ్రియేలు, లయోల కళాశాల రెక్టర్ ఫాదర్ పూదోటి రాయప్పజాన్ తదితర గురువులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు పోప్ ఫ్రాన్సిస్ సేవలను కొనియాడుతూ సందేశమిచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ళ పరిపాలనా కాలంలో కొత్త సంస్కరణలకు నాంది పలికారని గుర్తు చేశారు. పవిత్ర పూజాపీఠంపై పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కేథలిక్ డయాసిస్‌కు చెందిన 150 మందికి పైగా గురువులతో కలసి అంతిమ సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేథలిక్ డయోసిస్ పొక్రెయిటర్ ఫాదర్ బి.ఆనంద్ బాబు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు స్వామి, ఎడ్యుకేషన్ డస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఎస్‌ఎస్సీ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, ఫాదర్ పసల తోమస్, ఫాదర్ కె. కుమార్రాజా, ఫాదర్ వినోద్ తదితర గురువులు, కన్యాసీ్త్రలు, గృహస్థ క్రై స్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు కథోలికుల నివాళి


