ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వారణాసి శివరామ శౌరి, సౌజన్య కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. బంగారు తాపడం పనులకు గుంటూరుకు చెందిన కె. కోటేశ్వరరావు రూ. 1,00,101 విరాళంగా ఇచ్చారు.
బీసీల హక్కులకు పోరాటం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, హక్కుల కోసం పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌లోని రామారావు వీధిలో ఏపీ బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది. దీన్ని సంఘం మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణితో కలిసి హైకోర్టు న్యాయవాది వైకే, వైఎస్సార్ సీపీ ఆర్టిషన్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకే మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు కన్నా స్కూల్స్ అధినేత కన్నా, సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల శివ, రాధా, పెంటి శ్రీనివాస్, బత్తులనాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నంటౌన్: నగరంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి ఆపై తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 11వ తేదీ వరకూ దరఖాస్తులను విద్యాలయం పని వేళల్లో కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. తమ వెబ్‌సైట్లో నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని పూరించి ఆఫ్‌లైన్ మోడ్‌లో తమ కార్యాలయంలో అందజేయా లని, మరిన్ని వివరాలకు కేవీ ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు.
బంగారు తాపడం పనులకు రూ. 2 లక్షలు


