పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.87.48 లక్షల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. గురువారం అమ్మవారి మండపంలో కానుకలను లెక్కించారు. 52 రోజులకు గాను ఆలయంలో మొత్తం హుండీ కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.87,48,911, బంగారం 35 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 620 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే విదేశీ నగదు కొంత వచ్చిందన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో పాటు చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, జూపూడి గ్రూప్ టెంపుల్స్ ఈవో బి. రవీంద్రబాబు, ఏఎస్‌ఐ శంకర్ పర్యవేక్షించారు.
దుర్గమ్మ సన్నిధిలో చలువ పందిళ్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో దేవస్థానం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ మొదలు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలి గోపురం, ఆలయ ప్రాంగణం, రాజగోపురం పరిసరాల్లో ఈ పందిళ్ల పనులు నిర్వహిస్తోంది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆయా చలువ పందిళ్ల కింద సేదదీరేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పరిసరాల్లోని క్యూలైన్ మార్గాలలో కూలర్లు అందుబాటులో ఉంచారు. దేవస్థానంపై కీలక ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్డు, మహా మండపం, కనకదుర్గనగర్‌లలో మంచినీటి సరఫరా చేసేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా అలవాల సుందరయ్య
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో చైర్మన్‌గా అలవాల సుందరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ ఇంటి రాజు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీని ఎన్నిక చేసుకుంది. ఎన్నికల అధికారిగా సయ్యద్ ముస్తాక్ వ్యవహించారు. సమావేశంలో ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్‌గా అలవాల సుందరయ్య (యూటీఎఫ్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సయ్యద్ ఖాసీం ప్రకటించారు. అదేవిధంగా సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ ఇంటి రాజు (బీటీఏ), కోచైర్మన్‌లుగా జి. రామారావు(డీటీఎఫ్), ఆర్. రాంబాబు నాయక్ (ప్రధానోపాధ్యుయుల సంఘం) సయ్యద్ హఫీజ్ (రూటా), డెప్యూటీ సెక్రటరీ జనరల్‌గా సయ్యద్ ఖాసీం ( ఏపీటీఎఫ్), వి. భిక్షమయ్య(ఎస్‌టీయూ), సదారతుల్లా (ఏపీపీటీఏ), రవీంద్రప్రసాద్ (ఏపీటీఎఫ్ ) లను సమావేశం ఎన్నుకుంది.
పరమ పదనాథుడు అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం పరమ పద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు.
తిరుపతమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.87.48 లక్షలు
తిరుపతమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.87.48 లక్షలు
తిరుపతమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.87.48 లక్షలు