విజయవాడలీగల్: స్థానిక కోర్టు కాంప్లెక్స్‌లో సోమవారం న్యాయవాదుల కోసం మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మీడియేషన్‌లో 40 గంటల పాటు శిక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయని న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. తమిళనాడుకు చెందిన సీనియర్ ట్రైనీ ఎస్.అరుణాచలం, ఢిల్లీకి చెందిన రేణు అగర్వాల్ శిక్షణ ఇవ్వనున్నారు. న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ కె.వి.కృష్ణయ్య, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.