నేడు కృష్ణాతీరంలో మాక్‌డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కృష్ణాతీరంలో మాక్‌డ్రిల్‌

Published Tue, Mar 18 2025 10:00 PM | Last Updated on Tue, Mar 18 2025 10:01 PM

నాగాయలంక: ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణాతీరం వెంబడి మంగళవారం వరదలు వంటి విపత్తులపై మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తామని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. మాక్‌ డ్రిల్‌ సన్నాహక సమావేశంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన అధికారులతో సోమవారం టేబుల్‌ టాప్‌ ఎక్సర్‌సైజ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. బందరు ఆర్డీఓ కె.స్వాతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాక్‌డ్రిల్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎడ్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పరికరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. మాక్‌ డ్రిల్‌ క్షేత్రస్థాయి పర్యవేక్షణలో తాను స్వయంగా పాల్గొంటానని తెలిపారు. మెప్మా పీడీ పి.సాయిబాబు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్‌, తహసీల్దార్‌ ఎం.హరనాథ్‌, ఎంపీడీఓ జి.సధాప్రవీణ్‌, అవనిగడ్డ సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ కె.రాజేష్‌, ఇరిగేషన్‌ ఏఈ పి.రవితేజ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే రస్క్రాప్‌ ద్వారా

రూ.101.64 కోట్ల ఆదాయం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌ స్క్రాప్‌ విక్రయంతో రూ.101.64 కోట్ల ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ.79 కోట్ల స్క్రాప్‌ విక్రయ లక్ష్యాన్ని గత డిసెంబర్‌లోనే అధిగ మించి రూ.100 కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది ఈ–వేలం ద్వారా రైలు వ్యర్థాలు, ఎస్‌ అండ్‌ టీ వ్యర్థాలు, ఇంజినీరింగ్‌ వ్యర్థాలు, ఇతర లోహాల స్క్రాప్‌ 18,908 టన్నులు విక్రయించింది. స్క్రాప్‌తో ఇంత ఆదాయం సాధించడంలో కృషిచేసిన సీనియర్‌ డివిజనల్‌ మెటీరియల్‌ మేనేజర్‌ కె.బి.తిరుపతయ్యను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ అభినందించారు.

ప్రసవాలను నమోదు చేయాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలను విధిగా హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌) పోర్టల్‌లో నమోదు చేయా లని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నమోదులో జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి జననాన్ని తప్పకుండా సివిల్‌ రిజిస్టర్‌ సిస్టమ్‌(సీఆర్‌ఎస్‌) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రుల యాజమా న్యాలపై ఉందన్నారు. ఈ నిబంధనను ఉల్లఘించిన ఆస్పత్రులపై ఆంధ్రప్రదేశ్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పరీక్ష కేంద్రాల్లో ఎస్పీ తనిఖీలు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు సోమవారం మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పాండు రంగ మునిసిపల్‌ హై స్కూలును సందర్శించి పోలీసు బందోబస్తును పరిశీలించారు. అక్కడి నుంచి భాష్యం స్కూలుకు వెళ్లి పరీక్ష విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం నిర్మల హైస్కూల్‌, కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ను సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సీఐలు ఏసుబాబు, నబీ, పరమేశ్వరరావు, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్‌గా విద్యాసాగర్‌

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎ.విద్యాసాగర్‌ ఎన్నికయ్యారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీఓ హోంలో సోమవారం జరిగిన ఏపీ జేఏసీ సమావేశంలో విద్యాసాగర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో 50 ఉపాధ్యాయ, ఉద్యోగ క్యాడర్‌ సంఘాలు పాల్గొని ప్రస్తుత ఏపీ ఎన్జీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్‌ను ఏపీ జేఏసీ డెప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎన్నుకున్నాయి. అనంతరం విద్యాసాగర్‌ను రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు డి.వేణుమాధవరావు, వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విస్తరణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.జాన్‌ క్రిస్టోఫర్‌, ప్రధాన కార్యదర్శి ఐ.హానస్‌కుమార్‌ రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కృష్ణాతీరంలో మాక్‌డ్రిల్‌ 1
1/1

నేడు కృష్ణాతీరంలో మాక్‌డ్రిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement