కప్పేసిన మంచు దుప్పటి
విజయవాడ నగరాన్ని శుక్రవారం మంచుదుప్పటి కప్పేసింది. మంచు.. దారులను చుట్టేసింది. వాహన చోదకులు పగలు కూడా లైట్ల వెలుగులో ప్రయాణించారు. ఎముకలు కొరికే చలికి పిన్న, పెద్ద అల్లాడుతున్నారు. రాత్రి వేళే కాకుండా పగలు కూడా శీతల గాలులు వీస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరాన్ని పొగ మంచు కమ్ముకుంది. ప్రజలు స్వెట్టర్లు, జర్కిన్లు, ఇతర రక్షణ పద్ధతులతో రోడ్లపైకి వచ్చారు.
–కందుల చక్రపాణి,
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
కప్పేసిన మంచు దుప్పటి


