జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి | Sakshi
Sakshi News home page

జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి

Published Fri, Apr 19 2024 1:25 AM

- - Sakshi

బంటుమిల్లి: రాష్ట్రంలో తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటి ముందుకు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) నాయకులు, కార్యకర్తలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా హారిక, రాము ఇద్దరు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రామును, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వి. చినబాబు, వైస్‌ ఎంపీపీ ఒ.చిన్నారి బాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ టి.శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ పి. బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు కమాల్‌ బాషా, పి.వీరబాబు, ఆలీం, కె. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఎస్‌. మహేష్‌, నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం.రాజబాబు, ఎం.వెంకటేశ్వరరావు, జి.బాల, సీహెచ్‌ రాధాకృష్ణ, బి. గాంధీ, పి.నాని పాల్గొన్నారు.

ప్రజాదీవెనలో జెడ్పీ చైర్‌పర్సన్‌ హారిక

Advertisement
 
Advertisement