గాజుల అలంకరణలో గోపయ్య సమేత తిరుపతమ్మవారు
పెనుగంచిప్రోలు: పవిత్ర కార్తికమాస ఉత్సవాల్లో భాగంగా పెనుగంచిప్రోలు వేంచేసియున్న శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారితోపాటు సహదేవతలను ఆదివారం గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తిక మాసం కావడంతో భక్తులు వేలాదిగా అమ్మవారిని పాలు, పొంగళ్లతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గాజుల అలంకరణకు విజయవాడకు చెందిన దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కల్పన దంపతులు ఖమ్మంకు చెందిన కర్నాటి వీరభద్రరావు, రమాదేవి దంపతులు, పెనుగంచిప్రోలుకు చెందిన కంచర్ల కోటేశ్వరరావు, భవాని దంపతులు సహకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమేష్‌నాయుడు, ఏఈవో మల్లేశ్వరరావు, ఉమాపతి పాల్గొన్నారు.


