
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు, కంపెనీ ప్రతినిధులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతలో నైపుణ్యాల పెంపునకు ప్రయివేటు రంగ సంస్థల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. నగరంలోని ఉపాధి కల్పన శాఖ కార్యాల యంలో రాయల్ ఇన్‌ఫీల్డ్ సంస్థతో ఉపాధి కల్పన శాఖ ఒప్పందం పత్రాల మార్పిడి బుధవారం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ నిధులతో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అధునాతన టెక్నాలజీతో పూర్తి స్థాయి వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేస్తారు. ద్విచక్ర వాహనాల ఆటోమొబైల్ రంగంలో అధునాతన టెక్నాలజీతో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్ నాగవర్థ రాజు, విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నేషనల్ ట్రైనింగ్ హెడ్ కబిలన్, ఆ సంస్థ సౌత్ ఇండియా హెడ్ నరసింహారావు పాల్గొన్నారు.