సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు | Vasavi Matha Birthday Celebration In Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

May 16 2022 7:54 PM | Updated on May 16 2022 7:54 PM

Vasavi Matha Birthday Celebration In Singapore - Sakshi

సింగపూర్‌లో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు  స్థానిక మారియమ్మన్ ఆలయం నందు అమ్మవారికి విశేష అభిషేకము, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.  

ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా గతరెండేళ్లుగా వాసవి మాత జయంతి వేడుకుల్ని జూమ్‌లో నిర్వహించినట్లు తెలిపారు. కరోనా తగ్గడంతో భక్తుల మధ్య ప్రత్యక్షంగా అమ‍్మవారిని పూజించడం సంతోషంగా ఉందన్నారు. 

వాసవి క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తాము గత పదేళ్లుగా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలతో పాటు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మారియమ్మన్ ఆలయ జీర్ణోద్ధరణలో భక్తులు విరివిగా పాల్గొనాలని, ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement