ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు

Usa: New Jersey Public Utilities Board Give Honour To Upendra Chivukula For His ServiceQ - Sakshi

న్యూజెర్సీ పరిపాలన విభాగం ప్రశంసలు

అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం.. ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

న్యూజెర్సీ పబ్లిక్ యూటీలీటీస్ బోర్డు సమావేశంలో కమిషర్లు ఫియోర్డలిసో, హోల్డెన్, సోలమన్, గోర్డాన్, క్రిసోడౌలాలు... ఉపేంద్ర చివుకుల సేవలను గుర్తించి చేసిన తీర్మాన ప్రకటనను ఉపేంద్ర చివుకులకు అందించారు.

పన్ను చెల్లింపుదారులు, రేట్ పేయర్స్ కోసం గత 25 సంవత్సరాలుగా ఉపేంద్ర చివుకుల చేసిన సేవలు మరువలేనివిగా వారు అభివర్ణించారు. చిత్తశుద్ధితో, సేవా దృక్పథంతో పనిచేసిన ఉపేంద్ర చివుకులకు కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా ఓ ప్రశంస ప్రకటనను ఉపేంద్ర చివుకులకు అందించారు.

మరిన్ని వార్తలు :

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top