UAE: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం..!

UAE Switches Weekend to Saturday Sunday - Sakshi

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎఈలోని ఉద్యోగుల పనిదినాలను అక్కడి ప్రభుత్వం మార్చింది.    ఉద్యోగులు ఇక వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిచేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానుంది. 

యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది.

మొదటి దేశంగా యూఎఈ రికార్డు..!
ప్రపంచంలో ఐదు రోజుల కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం యూఎఈగా నిలుస్తోందని డబ్లూఏఎం తెలిపింది. మాజీ బ్రిటీష్ ప్రొటెక్టరేట్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారంలోపే ప్రకటించడం విశేషం. 2006 వరకు గురువారం-శుక్రవారం సెలవులుగా ప్రకటించగా...అది శుక్ర, శనివారాలకు ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చింది.
చదవండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top