
నేహా రెడ్డి ఆళ్ల .. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తల్లిదండ్రులు శివరామి రెడ్డి, నాగ మల్లేశ్వరి. తన తల్లి నాగ మల్లేశ్వరికి ఉన్న కళాపేక్ష వల్ల చిన్నప్పుడే వర్జీనియాలోని కళామండపం నృత్య పాఠశాలలో గురు మృణాళిని సదానంద గారి దగ్గర చేరి, కూచిపూడిలో మెలకువలు నేర్చుకుంది. గురువు మృణాళిని సదానంద గారి శిష్యరికంలో యెన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.. అంతేకాకుండా నేహా చదువులో కూడా అత్యంత ప్రతిభను కనపరుస్తూ ఎన్నో బహుమతులను తెచ్చుకుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది.
అంతేకాకుండా అమెరికాలో జరిగే పండుగ కార్యక్రమాలలో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుని ప్రసంశలు పొందింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. శనివారం, జూలై 5న తన గురువు గారు కళారత్న శ్రీమతి మృణాళిని సదానంద గారి అధ్వర్యం లో నృత్య సంభావన (అరంగేట్రం)చేసింది నేహా రెడ్డి ఆళ్ల.. గురు మృణాళిని సదానంద గారు అన్ని నృత్యములకు కొరియోగ్రఫీ చేయగా నేహ తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గురు సత్యప్రియ రమణ చీఫ్ గెస్ట్‌గా ఇండియా నుండి వచ్చారు.. కవిత చీడల ప్రవక్తగా వ్యవహారించారు.
నట్టువంగం శ్రీ కమల్ కిరణ్ గారు, వాయిలిన్ విద్వాన్ శ్రీ వింజమూరి సుభాష్ గారు, గాత్రం శ్రీమతి కృపా లక్ష్మి మరియు శ్రీ శశాంక గారు, శ్రీ విజయ్ గణేష్ గారి మృదంగం, శ్రీ సౌమ్య నారాయణన్ గారు ఘటం, వాయిలిన్ సపోర్టింగ్ ఎంఎస్ పద్మిని గారు, స్పెషల్ ఎపెక్ట్స్ శ్రీ రామకృష్ణ గోపినాథ్ తదితరులు సంగీతాన్ని అందించారు. కార్యక్రమానంతరం అందరినీ నేహా రెడ్డి ఆళ్ల తల్లితండ్రులు శ్రీ శివరామి రెడ్డి మరియు శ్రీమతి నాగ మల్లేశ్వరి దంపతులు మరియు సోదరుడు చేతన్ రెడ్డి ఆళ్ల సత్కరించారు..
అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల