వాసవి క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో సంక్రాంతి సంబరాలు

Sankranthi celebrations by Vasavi Club Merlion Singapore - Sakshi

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల వేడుకను పొంగోల్ పార్క్ లో  ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టి పడేలా, పిల్లలకు భోగి పళ్ళ దీవెనలతో ప్రారంభమైన ఈ వేడుకలు, గొబ్బెమ్మలు, మహిళల రంగు రంగుల రంగవల్లికల పోటీలు, పిల్లల పతంగుల తయారీ వంటి కార్యక్రమాలతో ఉత్సాహంగా జరిగాయి.

చిన్నారులు సంప్రదాయ దుస్తులలో పోటీపడి మరీ  తమ శ్రావ్యమైన గొంతులతో శ్లోకాలు, పాటలతో మురిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సంక్రాతి థీమ్ కి సంబంధించిన తెర ఏర్పాటులో సౌజి డేకర్స్ సంస్థ సభ్యులు సహకరించారు. ఫణీష్ ఆత్మురి ‘సంక్రాతి శోభ’  ప్రసంగం ఆహుతులని ఆకట్టుకొంది. 

పసందై సాంప్రదాయిక విందు భోజనంతో పాటు, రోజంతా సాగిన ఈ వేడుకలలో పిల్లలు, పెద్దలూ, దంపతులూ అనేక విన్నూత్నమైన ఆట పాటలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆద్యంతమూ ఉల్లాసంగా గడిపారు. సుమారు 190 మంది పెద్దలు, 50 మంది పిల్లలు పాల్గొని విజయవంతం చేసిన ఈ సంబరాలు, వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ దశమ వార్షికోత్సవంలోనికి అడుగిడుతున్న శుభ తరుణంలో జరగడం విశేషం.

సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ  సంఘీభావంతో ఈ వేడుకలలో పాల్గొనడం శ్లాఘనీయమని, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ గోట్ల  పేర్కొన్నారు. క్లబ్ సెక్రటరీ  నరేంద్ర కుమార్ నారంశెట్టి  వర్చువల్‌గా పాల్గొన్నారు.  ఈ సంక్రాతి సంబరాలు ఎంతో గొప్పగా నిర్వహించారని, వైశ్యులు ఎప్పుడు ఇలానే ధర్మసంబంధమైన,సాంప్రదాయ సంబంధమైన విషయాల్లో సమిష్టిగా  ఇలా విజయవంతంగా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమానికి తోడ్పడిన తోటి కార్య నిర్వాహక బృంద సభ్యులకు, సేవా దళానివారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సింగపూర్ ఆర్యవైశ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు,  భవిష్యత్తుకు ప్రేరణనివ్వడమేగాక, మన భావితరానికి మన సంప్రదాయాలను, కుటుంబ విలువలను పరిచయం చేయడానికి ఒక చక్కని వేదికలా నిలిచాయని, ఈ కార్యక్రమ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ సభ్యుడు   ముక్కా కిశోర్ తెలియ చేశారు, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అందరు చిన్నపిల్లల్లా ఆటపాటల్లో మునిగితేలారరని కార్యక్రమ నిర్వాహక కర్త  రాయల సుమన్, దివ్య   సంతోసం వ్యక్తం చేశారు.  ఇంకా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన జానపద కోకిల, డాక్టర్ అరుణ సుబ్బారావు ప్రత్యేక ప్రదర్శనలతో, పాటలతో ఆద్యంతం అందరిని ఆనందంలో ముంచెత్తింది. 

కార్యక్రమం విజయవంతమవ్వడంలో సంస్థ సభ్యులు సరిత, రాజా విశ్వనాథుల, రాఘవ, ఆనంద్, కిశోర్, శ్రీధర్ మంచికంటి, వాసవి సేవ సభ్యులైన శివ కిషన్, మార్తాండ్, చైతన్య, అవినాష్, చలం, గోపి కిషోర్, ప్రసాద్ బచ్చు, యదా నరేష్, పురుషోత్తం, సందీప్, సతీష్ వుద్దగిరి, సంతోష్ మాదారపు, మనోహర్, సత్య, దివ్య గాజులపల్లి తదితరులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top