యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌ | Four Indian Origin People Kidnapped From Merced County In California | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌

Published Tue, Oct 4 2022 3:18 PM | Last Updated on Tue, Oct 4 2022 8:09 PM

Four Indian Origin People  Kidnapped From Merced County In California  - Sakshi

కాలిఫోర్నియా: ఎనిమిది నెలల చిన్నారితో సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌కి గురయ్యింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మెర్సిడ్‌ కౌంటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సోమవారం 36 ఏళ్ల జస్దీప్‌ సింగ్‌, 27 ఏళ్ల జస్లీన్‌ కౌర్‌ వారి ఎనిమిదేళ్ల  పాప అరూహి ధేరి తోపాటు  39 ఏళ్ల అమన్‌దీప్‌ సింగ్‌ కిడ్నాప్‌ అయినట్లు మెర్సిడ్‌ కౌంటీ షెరీఫ్స్‌ కార్యాలయ(పోలీస్‌ కార్యాలయం) పేర్కొంది.  అలాగే నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పారు.

అంతేగాదు పోలీసులు ప్రజలను అనుమానితుడు లేదా బాధితులు గానీ కనిపిస్తే వారి వద్దకు వెళ్లవద్దని తమకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలానే 2019లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో భారత సంతతి టెక్కీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ యజమాని తుషార్‌ అత్రే తన ఇంటి నుంచి కిడ్నాప్‌ అయినా కొద్ది నిమిషాల్లోనే తన గర్లఫ్రెండ్‌ కార్లో శవమై కనిపించాడు.  

(చదవండి: ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement