టీప్యాడ్‌ ఆధ్వర్యంలో డల్లాస్‌లో రక్తదాన శిబిరం

Blood Camp Conducted By Telangana Peoples Association In Dallas - Sakshi

డల్లాస్‌ : తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపీఏడీ) ఆధ్యర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు 51 మంది పేర్లు నమోదు చేసుకోగా 30 పింట్స్‌ రక్తాన్ని సేకరించారు. ఒక్క పింట్‌ రక్తం ద్వారా ఆపదలో ఉన్న ముగ్గురి జీవితాలను కాపాడే అవకాశం ఉంది. 

ఈ ‍ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అనురాధ మేకల, మామిడి రవికాంత్‌, సుంకిరెడ్డి మాధవి, రావు కల్వల, గోలి బుచ్చిరెడ్డిలతో పాటు టీప్యాడ్‌కి చెందిన అనేక మంది వలంటీర్లుగా పని చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్రిస్కో, ప్లానో, అలోనో, కొప్పెలో తదితర ప్రాంతాలకు చెందిన యువతకు టీప్యాడ్‌ కల్పిస్తోంది. రక్తదాన శిబిరం నిర్వహాణకు సహాకారం అందించిన ఐటీ స్పిన్‌ కంపెనీకి టీప్యాడ్‌ ధన్యవాదాలు తెలిపింది. ఈ శిబిరానికి వచ్చి రక్తం దానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

చదవండి : తొలి గోల్ఫ్‌ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top