డల్లాస్‌లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

Bathukamma Celebrations At Dallas In Texas - Sakshi

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీప్యాడ్‌) ఆధ్వర్యంలో బిగ్‌బ్యారెల్‌ రాంచ్‌ ఇన్‌ ఆర్బేలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 550 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో ఇండియన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. 

బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని ఆడపడుచులు అందరూ స్వయంగా బతుకమ్మలు పేర్చారు. వీటితో పాటు టీప్యాడ్‌ తరఫున 14 అడుగుల బతుకమ్మను ప్రత్యేకంగా తయారు చేయించారు. బతుకమ్మ ఆటపాటల మధ్య సందడిగా ఈ వేడుకలు జరిగాయి. గతంలో టీ ప్యాడ్‌ ఆధ్వర్యంలో ఏకంగా 10 వేల మందితో బతుకమ్మ పండగ నిర్వహించారు. అయితే కోవిడ్‌ కారణంగా ఈ సారి వేడుకులను చెరువులు, పచ్చిక బయళ్ల మధ్యన ఉన్న 60 ఎకరాల ఫార్మ్‌ హౌస్‌లో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో నిర్వహించారు. 

దుర్గాపూజ, జమ్మిపూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి పరివారాన్ని ఎడ్లబండిలో ఉంచి ఊరేగించారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. చివరకు స్థానికంగా ఉన్న చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడంలో టీప్యాడ్‌ ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ రావు కల్వలతో పాటు మాధవి సుంకిరెడ్డి, రవికాంత్‌ మామిడి, గోలి బుచ్చిరెడ్డి, బండారు రఘువీర్‌, పీ ఇంద్రాణి, రూపా కన్నయగారి, అనురాధ మేకల తదితరులు కృషి చేశారు. 

చదవండి : లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top