టైమ్స్‌ స్వ్కేర్‌లో బండి సంజయ్‌.. అభిమానం చాటుకున్న ఎన్నారైలు | Bandi Sanjay Poster On Times Square Billboard - Sakshi
Sakshi News home page

Bandi Sanjay: టైమ్స్‌ స్వ్కేర్‌లో బండి సంజయ్‌.. అభిమానం చాటుకున్న ఎన్నారైలు

Sep 4 2023 10:27 AM | Updated on Sep 4 2023 11:21 AM

Bandi Sanjay Poster On Times Square Billboard - Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుడు ఆధ్వర్యంలో న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌ బిల్‌ బోర్డుపై బీజేపీ నేత బండి సంజయ్‌ వీడియోను ప్రదర్శించి తమ అభిమానం చాటుకున్నారు.

బండి సంజయ్  అమెరికా పర్యటనలో భాగంగా నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, వాషిగ్టన్‌ డీసీ, డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. బండి సంజయ్‌ని కలుసుకోవడానికి ప్రవాస భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement