నిజామాబాద్ రూరల్: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రజితాయాదవ్ను నియమిస్తూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రజితాయాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, పార్టీకి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. తనని నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్రెడ్డితోపాటు కాంగ్రెస్ శ్రేణులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పని చేస్తానని పేర్కొన్నారు.


