మెతుకు ప్రియం.. | - | Sakshi
Sakshi News home page

మెతుకు ప్రియం..

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలు

● జేఎస్‌ఆర్‌ రకం బియ్యం కిలోకు రూ.90 వరకు విక్రయం

● అసాధారణంగా ధరలు పెంచుతున్న వ్యాపారులు

● నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

● హోల్‌సేల్‌, రిటైల్‌ షాపుల వద్ద ధరల బోర్డుల ప్రదర్శనకు ఆదేశం

వాతావరణం

ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది.

హార్వెస్టర్‌ లీజు పేరిట..

హార్వెస్టర్‌లను లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన నలుగురిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

వ్యాపారులు బియ్యం ధరలకు రెక్కలు కడుతున్నారు. మార్కెట్‌లో అనూ హ్యంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పట్టించుకుంటున్న వారు లేరు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను కారణంగా చూపుతూ జిల్లాలో బియ్యం ధరలను అమాంతం పెంచేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో బియ్యం నిల్వలకు కొరత లేనప్పటికీ వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తూ కరువు పేరుతో బియ్యం ధరలను అడ్డగోలుగా పెంచేశారు. గత సీజన్‌లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొన్న వ్యాపారులు అదే బియ్యాన్ని ఇప్పుడు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం పండించిన ధాన్యం మరో సీజన్‌లో బియ్యంగా చేతికొస్తుంది. కానీ ఎల్‌నినో కారణంగా ధరలు పెరిగాయని చెబుతూ ఇప్పుడే అధిక ధరలకు విక్రయిస్తూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

ఎక్కడా కనిపించని బోర్డులు

ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెబుతోంది. ధరలను నిర్ణయించి నిర్ణీత రేట్లలోనే బియ్యాన్ని విక్రయించాలని ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలుకావడం లేదు. బియ్యం కిలో కనిష్టంగా రూ.66 నుంచి గరిష్టంగా 79 వరకు విక్రయించాలని, అంతకన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. బీపీటీ, కూనారం రకాలకు కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా రకానికి రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్‌ రకాన్ని గరిష్టంగా కిలో రూ.79 చొప్పున మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ధరల బోర్డును దుకాణాల వద్ద ప్రదర్శించాలని ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు.

పర్యవేక్షణ కమిటీలు

బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటుచేసింది. ధరల నియంత్రణ, అక్రమ నిల్వల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాల్సి ఉండగా.. కమిటీల నిర్వహణ నామమాత్రంగా కొనసాగుతోంది. గోదాములు, మిల్లుల్లో ఉన్న నిల్వలు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు ఏ ధరలకు విక్రయిస్తున్నారు? అన్న అంశాలపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ చేపడితేనే ధరల నియంత్రణకు అవకాశం ఉండనుంది.

రూ.9 వేలకు జైశ్రీరాం..

జిల్లాలో జైశ్రీరాం రకం సన్నబియ్యం ధర గతంలో క్వింటాల్‌కు రూ.7,800 ఉండగా.. ప్రస్తుతం రూ.9 వేల వరకు విక్రయిస్తున్నారు. హెచ్‌ఎంటీ రూ.6,500 నుంచి 8,500 చేరింది. ఏ రకం సన్నబియ్యమైనా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. జేఎస్‌ఆర్‌ రకం బియ్యాన్ని కిలో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఈసారి సైతం 4.50 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగైంది. ధరలు పెరిగాయంటూ పాత బియ్యాన్నే అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర భారం పడుతోంది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బియ్యం విక్రయించాల్సిన గరిష్ట ధరలు

అధిక ధరలకు విక్రయిస్తే కేసులు

జిల్లాలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ బియ్యం నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇందుకోసం మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. – అరవింద్‌రెడ్డి,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

పేదలు, సామాన్యులకు భారం

నిత్యవసరాల్లో బియ్యమే ప్రధానం. ఈసారి కొన్ని రోజుల వ్యవధిలో నే బియ్యం ధరలను అమాంతం పెంచారు. గతంలో కిలో రూ.60 లోపు ఉంటే ఇప్పుడు రూ.90 వరకు అమ్ముతున్నారు. పేదలు, సామాన్యులపై తీవ్రమైన భారం పడుతోంది. ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావాలి. – మురళి, ఆర్మూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement