పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

● రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ

సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రుద్రూర్‌: ఇళ్లులేని పేదల సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొప్పాపూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి పండుగ సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు. లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్‌వో, హౌసింగ్‌ పీడీ గీత, బోధన్‌ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌ సురేందర్‌ నాయక్‌, ఎంపీడీవో హరిప్రసాద్‌, ఎంపీవో అరవింద్‌, సర్పంచ్‌ సుమలతకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement